Kaapari – Gorrelu| కాపరి – గొర్రెలు

Title: మందలో చేరిన గొర్రెలు రెండు రకములు….
ఒకటి : మెదడు ఉన్న గొర్రెలు….
రెండు : మెదడు లేని గొర్రెలు….
ఒకటి : మెదడు ఉన్న గొర్రెలు….
రెండు : మెదడు లేని గొర్రెలు….
మెదడు ఉన్న గొఱ్ఱెలతో పెద్ద సమస్య ఏమీ ఉండదు… అవి తమ కాపరి స్వరాన్ని వింటాయి… తమ కాపరి ఎవరో గుర్తిస్తాయి… తమ కాపరినే వెంబడిస్తాయి… ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకునే వివేచన ఈ గొఱ్ఱెలకు ఉంది… కారణం ఇవి “మెదడు ఉన్న గొర్రెలు…”… ఈ గొఱ్ఱెలకు మెదడు(వివేచన శక్తి) ఉంది….
అపొస్తలుడైన పౌలు బెరయలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు బెరయలోని మనుష్యులు పౌలు ప్రకటిస్తున్న వాక్యం లేఖనాల ప్రకారంగా ఉందా లేదా అని పరిశీలించి, ఆ తరువాత అతని వాక్యప్రకటన లేఖనాల ప్రకారంగానే ఉందని గ్రహించి అప్పుడు పౌలు చెబుతున్నమాటల మీద విశ్వాసం ఉంచారు…. (Acts 17:10-13)…
ఈ బెరయలోనివారు మెదడు ఉన్న గొర్రెలు…అందుకే పౌలు వాక్యప్రసంగాన్ని పరిశీలించాకే అంగీకరించారు…
◆ ఇక మెదడు లేని గొర్రెలు కొన్ని ఉన్నాయి…. వీరికి మెదడు( వివేచనా శక్తి) లేదు గనుక ఏది సత్యమో, ఏది అసత్యమో వివేచించలేరు…
వాక్యం వింటున్నప్పుడు అది వాక్యప్రకారంగా ఉందా లేదా అనేది వీరికి అనవసరం… సూటూ బూటూ వేసుకొని ,బైబిల్ బోధించే ప్రతీఒక్కరి బోధనూ గుడ్డిగా అంగీకరించేస్తారు…అతడు ప్రకటిస్తున్నదాంట్లో సత్యం ఉందా, ఈ బోధ నన్ను నిత్యజీవానికి నడిపిస్తుందా అనేవి వీరికి అనవసరం…ఆ బోధకుడు ప్రార్థిస్తూ ఉండగా కడుపు నొప్పి తగ్గితే చాలు, అక్కడికి పరిగెడతారు…నలుగురిని ఎత్తి కింద పడేస్తే చాలు అతడు ఆత్మపూర్ణుడనుకుంటారు……
“మాకు సత్యం తో పనిలేదు… వాక్యం తో పనిలేదు… అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, జ్వరాలు పోతున్నాయి, ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి…కాబట్టి అక్కడికి ఉరుకుతాం…”….. ఇది వీరి మనస్తత్వం…..
(గమనిక : దురాత్మ కూడా అద్భుతాలు, స్వస్థతలు చేయగలదు…)
సత్యాన్ని పరిశీలించక ఇలా గుడ్డిగా అంగీకరిస్తూ ముందుకు కదలడం వలన చివరి వీరు చెరుకునెది నిత్యనరకం.