Neethigala Yehova Stuthi | Andhra kraisthava Keerthanalu

నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి                                                  ||నీతి||
చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును           ||నీతి||
సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను      ||నీతి||
గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి                  ||నీతి||
పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు             ||నీతి||
ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి             ||నీతి||
ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే                       ||నీతి||


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.