ఆకాశమందున్న ఆసీనుడా | Telugu christian devotional
song lyrics
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను – నేను
నీ తట్టు కనులెత్తుచున్నాను
1.దారి తప్పిన గొర్రెను నేను
త్రోవ కానక తిరుగుచున్నాను
కరుణించుమా యేసు కాపాడుమా
నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
2. గాయపడిన గొర్రెను నేను
బాగుచేయుమా పరమవైద్యుడా ||కరుణించుమా||
3. పాప ఊబిలో పడివున్నాను
లేవనెత్తుమా బాగుచేయుమా ||కరుణించుమా||
4.ఎండిపోయిన ఎముకను నేను
ఆత్మ నింపుము బ్రతికించుము ||కరుణించుమా||