Rende rendu dharulu | రెండే రెండు దారులు
song lyrics
రెండే రెండు దారులు ఏ దారి కావాలో మానవా
ఒకటి పరలోకం మరియొకటి పాతాళం
1. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధులకోసం
రాత్రి ఉండదు పగలు ఉండదు – సూర్యుడుండడు చంద్రుడుండడు
దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను– యుగయుగములు పరలోక
రాజ్యమేలుచుండెను – యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
||రెండే||
2. పాతాళం అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
అగ్ని ఆగదు పురుగు చావదు – అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
అబ్రాహాము రొమ్మున లాజరును చూశాడు – లాజరును చూసి దాహమని అడిగాడు
యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో
||రెండే||
3. పుడతావు నీవు దిగంబరిగ వెళతావు నీవు దిగంబరిగ
గాలి మేడలు ఎన్నో కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు – ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి
అగ్నిలోన పడకుండా యేసు ప్రభుని నమ్ముకో
||రెండే||
