kaalamu ledika | J.K Christopher

పల్లవి : కాలము లేదిక కాయము రాకడ కనురెప్పపాటులో వచ్చును క్రీస్తేసుని రాకడ కాలము లేదిక(2) 1.దేవుని వాక్యపు నెరవేర్పు – దగ్గరపడేనని గ్రహియించు(2) దాగుట నీకు అసాధ్యము – యేసుని చేరుము వేగమే(2) | కాలము| 2.రక్షణ నీకు ఉన్నదా – రయమున క్రీస్తు రానుండే(2) రమ్యమైన ఆ రాజ్యములో రారాజు క్రీస్తుతో ఉందుము(2)| కాలము| 3.పాపపు బ్రతుకును విడనాడి - పరిశుద్దాత్మను పొందేదమా(2) పావన యేసును మార్గమున – పయనించి చేరుము దేవుని(2) | కాలము|