Ascharyamaina prema |ఆశ్చర్యమైన ప్రేమ
కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది – 2
నన్ను జయించే నీప్రేమ
- పరమును వీడిను ప్రేమ ధరలో -పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించీ,ఆదరించీ,సేదదీర్చీ,నిత్య జీవమిచ్చే - పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ
నాకై మరణించి,జీవమిచ్చీ జయమిచ్చి తన మహిమనిచ్చే - నాస్థితి జూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ
నాకై పరుగెత్తి,కౌగిలించి ముద్దాడి, కన్నీటిని తుడిచెను - శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడనీ,ప్రేమదీ ఎన్నడు ఎడబాయనిది