Ayane ba sangeethamu | ఆయనే నా సంగీతము
ఆయనే నా సంగీతము – బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను
” ఆయనే”
- స్తుతుల మద్యలోన నివాసం చేసే – దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని – దిక్కులేని పిల్లలకు దేవుడాయనే “ఆయనే” - ఇద్దరు ముగ్గురు నామంబున – ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండేదననినా మనదేవుని – కరములు తట్టి నిత్యం స్తుతించెదము “ఆయనే” - సృష్టికర్త క్రీస్తు యేసు నామమున – జీవితకాలమెల్ల కీర్తించెదను
ప్రభురాకడలో నిత్యముందును – మ్రొక్కెదం స్తుతించెదం పొగడెదము “ఆయనే”