He prabu yesu |హే ప్రభుయేసు హే ప్రభుయేసు
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా “హే ప్రభు”
- శాంతి సమాధానాధిపతీ – స్వాంతములో ప్రశాంతనిధి
శాంతిస్వరూప జీవనదీపా – శాంతి సువార్తనిధీ “సిల్వ” - తపములు తరచిన నిన్నేకదా – జపములు గొలిచిన నిన్నేగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు -సఫలత నీవెకదా “సిల్వ” - మతములు వెదకిన నిన్నేకదా – వ్రతములుగోరిన నిన్నేగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన – హితమతి నీవెగదా “సిల్వ” - పలుకులలో నీ శాంతికధ – తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము- కలకల లాడెగదా “సిల్వ”