nee jeevithamlo Gamyambu |నీ జీవితములో గమ్యంబు ఏదో
నీ జీవితములో గమ్యంబు ఏదో – ఒకసారి యోచింపవా?
ఈ నాడే నీవు ప్రభు యేసు కొరకు – నీ హృదయ మర్పించవా?
- నీ తల్లి గర్బమున నీ వుండినపుడే – నిను చూచె ప్రభు కన్నులు (2)
యోచించి నావా ఏరీతి నిన్ను – నిర్మించే తన చేతులు “నీ జీవిత” - నీ లోన తాను నివసింపగోరి – దినమెల్ల చే జాచెను (2)
హృదయంబు తలపు – తెరువంగ లేవా యేసు ప్రవేశింపను “నీ జీవిత” - తన చేతులందు హృదయంబు ధారల్ – స్రవియించె నీకోసమే (2)
భరియించే శిక్ష నీ కోసమేగా – ఒకసారి గమనించవా? “నీ జీవిత” - ప్రభు యేసు నిన్ను సంధించి నట్టి – సమయంభు ఈ నాడేగా (2)
ఈ చోటు నుండి ప్రభు యేసు లేక – పోభోకుమా సోదరా “నీ జీవిత”