Randi Yehovanu Gurchi |రండి యెహోవాను గూర్చి
రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము
ఆయనే మన పోషకుడు – నమ్మదగిన దేవుడనీ
ఆహా……అహల్లెలూయా… ఆహా……అహల్లెలూయా…
- కష్ట నష్టములెన్నున్నా – పొంగు సాగరమెదురైనా
ఆయనే మన ఆశ్రయం – ఇరుకులలో ఇబ్బందులలో “రండి” - విరిగి నలిగిన హృదయముతో – దేవ దేవుని సన్నిదిలో
అనిశము ప్రార్ధించినా – కలుగు ఈవులు మనకెన్నో “రండి” - త్రోవ తప్పిన వారలను – చేర దీసే నాధుడనీ
నీతి సూర్యుడు ఆయనే నని – నిత్యము స్తుతి చేయుదము “రండి”