Ruchi chuchi Yerigithini |రుచి చూచి యెరిగితిని
రుచి చూచి యెరిగితిని – యెహోవా ఉత్తముడనియు – 2
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని
- గొప్పదేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు – దయాళుడవు నీవే - మహోన్నతుడగు దేవా – ప్రభావము గలవాడా
మనసార పొగడెదను నీ – ఆశ్చర్య కార్యములన్ - మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో
ముదమార పాడెద నిన్ను – అతి సుందరుడవనియు - నా జీవితమంతయును – యెహోవాను స్తుతించెదను
నా బ్రతుకు కాలములో నా- దేవుని కీర్తింతున్ - సంతోషించెద నెల్లపుడు – కష్ట ధు:ఖ భాధలలో
ఎంతో నెమ్మది నిచ్చు నా – రక్షకుడు నాయేసు - ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిదిలో చేరి
సంపూర్ణముగా పొందెదను – అడుగు వాటన్నిటిని - కృతజ్నత చెల్లింతు – ప్రతి దాని కొరకు నేను
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను