Sagilapadi Mrokkedamu |సాగిల పడి మ్రొక్కెదము
సాగిల పడి మ్రొక్కెదము – సత్యముతో ఆత్మాలో
మన ప్రభు యేసునీ ఆ..ఆ..ఆ…
- మోసే కంటే శ్రేష్టుడు – అన్ని మోసముల నుండి విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో మ్రెక్కెదము ” సాగిల” - అహరోను కంటే శ్రేష్టుడు – మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రదాన యాజకుడు – అందరము మ్రొక్కెదము “సాగిల” - ఆలయము కన్న శ్రేష్టుడు – నిజ ఆలయముగ తానే యుండెన్
ఆలయము మీరే యనెను – ఎల్ల కాలము మ్రొక్కెదము “సాగిల” - యోనా కంటే శ్రేష్టుడు – ప్రాణధానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్- ఘనపరచి మ్రొక్కెదము “సాగిల” - సొలోమొను కన్న శ్రేష్టుడు – సర్వ జ్ఞానమునకు ఆధారుండు
పది వేలలో అతి ప్రియుండు – పదిలముగా మ్రొక్కెదము “సాగిల” - రాజుల కంటే శ్రేష్టుడు – యాజకులనుగా మనలను చేసెను
రారాజుగ త్వరలో వచ్చున్ – – రయముగను మ్రొక్కెదము “సాగిల” - అందరిలో అతి శ్రేష్టుడు – మన కందరికి తానే ప్రభువు
హల్లేలూయకు పాత్రుండు – అను దినము మ్రొక్కెదము “సాగిల”