Shramalandu Neevu |శ్రమలందు నీవు నలిగే సమయమున
శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీ
యోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని”2″
- శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?
ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? “2″ “శ్రమలందు” - శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?
ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? “2″ “శ్రమలందు”