yesu neeve kaavalayya | stevenson |యేసూ నీవే కావాలయ్యా
యేసూ నీవే కావాలయ్యా – నాతో కూడా రావాలయ్యా
ఘనుడా ని దివ్య సన్నిధి – నను ఆదుకొనే నా పెన్నిధి (2)
అ.ప: నీవే కావాలయ్యా – నాతో రావాలయ్యా..
- నీవే నాతో వస్తే – దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్నంటదు - నీవే నాతో వస్తే – కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్నంటదు - నీవే నాతో వస్తే – ఓటమి నా కుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్నంటదు