Yesu Parishudda Namamunaku |యేసు పరిశుద్ధ నామమునకు
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే
- ఇహపరమున మేలైన నామము – శక్తి గల్గినట్టి నామమిది
పరిశుద్దులు స్తుతించు నామమిది – 2 “యేసు” - సైతానున్ పాతాళమును జయించు – వీరత్వము గల నామమిది
జయమొందెదము ఈ నామమున – 2 “యేసు” - నశించు పాపుల రక్షించులోక – మున కేతెంచిన నామమిది
పరలోకమున చేర్చు నామమిది – 2 “యేసు” - ఉత్తమ భక్తుల పొగడి స్తుతించు – ఉన్నత దేవుని నామమిది
లోకమంతా ప్రకాశించు నామమిది – 2 “యేసు” - శోదన, భాధల, కష్ట సమయాన – ఓదార్చి నడుపు నామమిది
ఆటంకము తొలగించు నామమిది – 2 “యేసు”