కృపగల దేవుని సర్వదా నుతించుఁడి |Krupagala devuni
Let us, with a gladsome mind 38:1,2,3,4,5,6
1.కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
2.సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును
3.పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
4.సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
5.కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.
6.దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.