Priya yesu raju |ప్రియ యేసు రాజును నే
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు – మహిమలో నేనాయనతో నుంటేమేలు
నిత్యమైన మోక్షగృహము నందు చేరి – భక్తుల గుంపులో హర్షించిన చాలు
- యేసుని రక్తమందు కడుగబడి-వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కళంక పరిశుద్ధులతో పోదున్ నేను-బంగారు వీదులలో తిరిగెదన్ “ప్రియ” - దూతలు వీణలను మీటునపుడు-గంభీర జయద్వనులు మ్రోగినపుడు
హల్లెలూయ పాటల్ పాడుచుండ-ప్రియ యేసుతోను నేను ఉల్లసింతున్ “ప్రియ” - ముండ్ల మకుటంబైన తలనుజూచి-స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడలతో కొట్టబడిన వీపునుజూచి-ప్రతి యెక్క గాయమును చుంబింతును “ప్రియ” - హృదయము స్తుతులతో నింపబడె-నా భాగ్య గృహమును స్మరించు చుంటె
హల్లెలూయ…..ఆమేన్,హల్లేలూయా..- వర్ణింప నా నాలుకచాలదయ్యా “ప్రియ” - ఆహ! యా బూర యెపుడు ధ్వనించునో – ఆహా ! నా ఆశ యెపుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచు నెపుడో-ఆశతో వేచియుండె నా హృదయము “ప్రియ”