Aparadhini Yesayya|అపరాదిని యేసయ్యా

అపరాదిని యేసయ్యా – కృప జూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో – నపరాధములను క్షమించు

  1. సిలువకు నిను నే గొట్టితిని – తులవలతో జేరితిని
    కలుషంభులను మోపితిని – దోషుండనేను ప్రభువా
  2. ప్రక్కలో బల్లెపుపోటు – గ్రక్కున పొడిచితి నేనే
    మిక్కిలి బాధించితిని – మక్కువ జూపితివయ్యా
  3. ముళ్ళతో కిరీటంబు – నల్లి నీ శిరమున నిడితి
    నా వల్ల నేరమాయె – చల్లని దయగల తండ్రీ
  4. దాహంబు గొనగా చేదు – చిరకను ద్రావనిడితి
    ద్రోహుండనై జేసితినీ – దేహంబుగాయములను
  5. గోరంబుగా దూరితిని -నేరంబులను జేసితిని
    క్రూరుండనై గొట్టితిని – ఘోరంపు పాపిని దేవా
  6. చిందితి రక్తము నాకై – పొందిన దెబ్బలచేత
    నిందలు పెట్టితినయ్యో – సందేహమేలనయ్యా
  7. శిక్షకు పాత్రుడనయ్యా – రక్షణ దెచ్చితివయ్యా
    అక్షయభాగ్యము నియ్యా – మోక్షంబు జూపితివయ్యా
                                                                        – (సిరిపురపు కృపానందము )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.