Bhajiyinthumu Ninu |భజియింతుము నిను జగదీశా
భజియింతుము నిను జగదీశా – శ్రీయేసా మా రక్షణ కర్త -2
శరణు, శరణు మా దేవ యెహోవా – మహిమా.న్విత చిర జీవనిధి
- విమల సెరాపులు – దూత గణంబులు- చూడగ లేని తేజోనిదివే
మా యాఘములకై సిలువ మ్రానుపై – దీనుడవై మరణించితివే “శరణు” - ప్రప్రధముడ మరి కడపటివాడ – మృతుడై బ్రతికిన నిరత నివాసి
నీ భజనయే మా జీవాధారం – జేకొనుమా మా స్తుతి గీతం “శరణు”