Chuchuchunnamu ne vypu |చూచుచున్నాము నీ వైపు

దేవుని వైపు చూచుట 11:1,2,3,4,5

1.చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీవైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాఁచుచుఁ గరములు చక్కఁగా నీవైపు           ||చూచు||
2.మేమరులమై యుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమచే నప్పుడు ప్రియ తనయ నంపించి క్షేమమార్గము మాకుఁ బ్రేమను జూపితివి     ||చూచు||
3.నిను నమ్ము పాపులకు వారెవరైన నీ శరణుఁ జొచ్చువారలకు ఇ నుఁడవు కేడెంబు నీ జగతిలో నగుచుఁ గనుపరచుచుందువు ఘన మైన నీ కృపఁ                  ||చూచు||
4.నీ భయము మాయెదలను నిలుపుము నీదు ప్రాభవ మొనరంగను నీ భయముచే మేము వైభవ మొందుచు నే భయము లేకుండ నీ భువిని గొన్నాళ్ళు   ||చూచు||
5.దయఁజూచి మము నెప్పుడు మంచివి యన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయుమని కోరఁ దయజూపి మన్నించు దయగల మాతండ్రి                                                                                                                      ||చూచు||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.