Dahamu gonna Varalara |దాహము గొన్నవారలారా
దాహము గొన్నవారలారా దాహము తీర్చుకొనండి
దేవుడేసే జీవజలము – త్రాగ రారండి
హల్లేలూయ దేవుడేసే జీవజలము త్రాగ రారండి
- జీవ జలము శ్రీ యేసుక్రీస్తు జీవపు ఊటలు ప్రవహింప జేయున్
జలము పొంది – జీవము నొంద జలనిధి చేరండి “దేవుడేసే” - నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికిని దాహముగొనరు
అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరండి “దేవుడేసే” - తన పాపములను ఎరిగినవాడు తండ్రి క్షమాపణ కోరినవాడు
తప్పక పొందును జీవజలము త్వరపడి పరుగిడి రండి “దేవుడేసే”