Deva Samsthuthi |దేవ సంస్తుతి చేయవే మనసా

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతు‌డగు యెహొవా సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా – నా జీవమా యెహొవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము లో వసించునో సమస్తమా   “దేవ”

  1. జీవమా, యెహొవా నీకు జేసిన మేళ్లన్ మరవకు – నీవు చేసిన పాతకంబులను
    మన్నించి జబ్బు – లేవియున్ లేకుండ జేయును ఆ కారణముచే               “దేవ”
  2. చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను – జీవ కిరీటముగ వేయును
    నీ శిరసు మీద – జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే                           “దేవ”
  3. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త – యౌవనంబై వెలయునట్లుగ
    మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ కారణముచే                 “దేవ”
  4. పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు – భూమికన్న నాకసంబున్న
    యెత్తుండు దైవ – ప్రేమ భక్తి జనుల యందున ఆ కారణముచే                   “దేవ”
  5. పడమటికి దూర్పెంతయెడమో పాపములకును మనకునంత-యెడము కలుగజేసియున్నాడు
    మన పాపములను ఎడముగానే చేసియున్నాడు ఆ కారణముచే                “దేవ”
  6. మనము నిర్మితమయిన రీతి తనకు దెలిసియున్న సంగతి-మనము మంటివార మంచును
    జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపు చుండును ఆ కారణముచే                 “దేవ”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.