Devudu Manaku Yellapudu |దేవుడు మనకు ఎల్లప్పుడు
దేవుడు మనకు ఎల్లప్పుడు – తోడుగ నున్నాడు – 2
- ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను – ధన్యులు దేవుని గలవారు “తోడుగ” - దైవాజ్ఞను శిరసావాహించి – దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు – ఖడ్గమునెత్తిన యపుడు “తోడుగ” - యేసేపు ద్వేషించబడి నపుడు – గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు – సింహాసన మెక్కిన యపుడు “తోడుగ” - ఫరోరాజు తరిమిన యపుడు – ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు – ఎరికో కూలినా యపుడు “తోడుగ” - దావీదు సింహము నెదిరించినపుడు – దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు – సౌలుచే తరమ బడినపుడు “తోడుగ” - సింహపు బోనులో దానియేలు – షడ్రకు,మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్ – నల్గురుగా కనబడినపుడు “తోడుగ’ - పౌలు బంధించబడినపుడు – పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు – హింసించాబడిన యపుడు “తోడుగ”