Eguruchunnadi Vijaya Pathakam |ఎగురుచున్నది విజయ పతాకం
ఎగురుచున్నది విజయ పతాకం
యేసు రక్తమే మా జీవిత విజయం
రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే
రక్తమే జయం – యేసు రక్తమే జయం
- యేసునినామం ఉచ్చరింపగనే – సాతాను సైన్యము వణుకు చున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడే “రక్తమే” - దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం – ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం “రక్తమే” - మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా – ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే “రక్తమే”