Gadachina Kaalam |గడచిన కాలము కృపలో మమ్ము
గడచిన కాలము కృపలో మమ్ము – కాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె – కాచిన దేవా నీకే స్తోత్రము “2”
మము కాచిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన దేవా నీకే స్తోత్రము “2” “గడచిన”
- కలచెందినా కష్ట కాలమున – కన్న తండ్రివై నను ఆదరించినా
కలుషము నాలొ కానవచ్చిన – కాదనక నను కరుణించినా “2”
కరుణించిన దేవా నీకే స్తోత్రము – కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము “గడచిన” - లోపములెన్నో దాగివున్నను – కాదనకా నను నడిపించినా
అవిదేయతలే ఆవరించినా – దీవెనలెన్నో దయచేసినా “2”
దీవించిన దేవా నీకే స్తొత్రముల్ కాపాడిన తండ్రీ నీకే స్తోత్రము “2” “గడచిన”