Koniyada Tharame ninu | కొనియాడఁ దరమె నిన్ను | TELUGU CHRISTMAS SONG

బాలయేసునకు స్వాగతము 108:1,2,3,4,5,6,7

కొనియాడఁ దరమె నిన్ను కోమల హృదయ కొనియాడఁ దరమె నిన్ను 

తనరారు దినకరుఁ బెనుతారలను మించు 
ఘనతేజమున నొప్పు కాంతిమంతుఁడ వీవు      ||కొనియాడ||

ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు 
నురుతరంబుగఁ గొలువ నొప్పు శ్రేష్ఠుఁడ వీవు     ||కొనియాడ||

సర్వలోకంబులఁ బర్వు దేవుఁడ వయ్యు 
నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి వీవు          ||కొనియాడ||

విశ్వమంతయు నేలు వీరాసనుఁడ వయ్యుఁ
పశ్వాళితోఁ దొట్టిఁ పండియుంటివి నీవు         ||కొనియాడ||

దోసంబులను మడియు దాసాళిఁ గరుణించి 
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు         ||కొనియాడ||

నరులయందునఁ గరుణ ధర సమాధానంబు
చీరకాలమును మహిమ పరఁగఁ జేయుదు వీవు    ||కొనియాడ||

ఓ యేసు పాన్పుగ నా యాత్మఁ జేకొని 
శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత           ||కొనియాడ|| 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.