Maa Yesu Kristhu neeve |మా యేసు క్రీస్తు నీవే

ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము 30:1,2,3,4,5,6,7,8,9,10,11,12

1.మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||
2.భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
3.విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
4.నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||
5.నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||
6.దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||
7.నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||
8.నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|
9.దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||
10.నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||
11.ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||
12.నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.