Madhuramainadi Naa Yesu Prema |మధురమైనది నా యేసు ప్రేమ
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ “2”
మరువలేనిది నా యేసు ప్రేమ “2”
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా…ప్రేమా…ప్రేమా..నా యేసు ప్రేమా
- ఇహలోక ఆశలతో అందుడనేనైతిని
నీసన్నిది విడచి నీకు దూరమైతిని “2”
చల్లనీ స్వరముతో నన్ను నీవు పిలచి”2″
నీసన్నిదిలో నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా…ప్రేమా…ప్రేమా..నా యేసు ప్రేమా - పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పినా
ఎగసిపడే అలలతో కడలే గర్జించినా “2”
మరణపు చాయలే ధరి చేరనీయక “2”
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం
ప్రేమా…ప్రేమా…ప్రేమా..నా యేసు ప్రేమా - నీ శిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి “2”
మరణపు ముల్లును విరచిన దేవా “2”
జీవము నొసగినా నీ ప్రేమ మధురం
ప్రేమా…ప్రేమా…ప్రేమా..నా యేసు ప్రేమా