Manasunna Manchi Deva |మనసున్న మంచిదేవా
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
- హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా - చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా - నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా