Mangalame Yesunaku |మంగళమే యేసునకు
క్రీస్తునకు స్తోత్రము 73:1,2,3,4,5,6,7
1.మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ||మంగళమే||
2.పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిపుణ వద్యునకు||మంగళమే||
3.దురిత సంహారునకు వరసుగుణోదారునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు||మంగళమే||
4.సత్య ప్రవర్తునకు సద్దర్మశీలునకు నిత్యస్వయంజీవునకు నిర్మలాత్మునకు||మంగళమే||
5.యుక్తస్తోత్రార్హూనకు భక్తరక్షామణికి సత్యపరంజ్యోతి యగు సార్వభౌమునకు||మంగళమే||
6.నరఘోర కలుషముల నురుమారంగ నిల కరుదెంచిన మాపాలి వర రక్షకునకు||మంగళమే||
7.పరమపురి వాసునకు నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు బ్రణుతింతుము నిన్ను ||మంగళమే||