Naa Jeevtha Yathralo |నా జీవిత యాత్రలో
నా జీవిత యాత్రలో ప్రభువా – నీ పాదమే శరణం
ఈలోకమునందు నీవు తప్ప – వేరే ఆశ్రయం లేదు
- ఈ లోకనటన ఆశలన్నియు – తరిగి పోవుచుండగా
మారని నీ వాగ్ధానములన్నియు – నే నమ్మిసాగెదను “నాజీవి” - పలువిధ శోధన, కష్టములు – ఆవరించు చుండగా
కలత చెందుచున్న నా హృదయమును – కదలకకాపాడుము “నాజీవి” - నీసన్నిధిలో సంపూర్ణమైన – సంతోషము కలదు
నీదు కుడి హస్తములో నిత్యమున్న – నాకు సుఖక్షేమమేగా “నాజీవి”