Nadipistadu Naa Devudu |నడిపిస్తాడు నాదేవుడు
నడిపిస్తాడు నాదేవుడు శ్రమలోనైనా నను విడువడు
అడుగులు తడబడినా అలసట పైబడినా
చేయితట్టి వెన్నుతట్టి చక్కని ఆలొచన చెప్పి (2)
- అంధకారమే దారి మూసినా – నిందలే నను కృంగదీసినా
తనచిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు - కష్టాల కొలిమి కాల్చివేసినా – శోకాలు గుండెను చీల్చివేసినా
తనచిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు - నాకున్న కలిమి కరిగిపోయిన – నాకున్న బలిమి తరిగిపోయిన తనచిత్తం నెరవేర్చుతాడు – గమ్యం వరకు నను చేర్చుతాడు