Nammi Nammi |నమ్మి నమ్మి మనుష్యులను
నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మీ
పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు
ఇలా… ఎంత కాలము… నీవు సాగిపోదువు…
- రాజులను నమ్మి – బహుమతిని ప్రేమించినా
బిలాము ఏమాయెను? – దైవదర్శనం కోల్పోయెను
నాయేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే “నమ్మినమ్మి” - ఐశ్వర్యము నమ్మి – వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? -అగ్నికి ఆహుతి ఆయెను
నాయేసయ్యను నమ్మిన యెడల ( యెహోషువ 7:21,26 )
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే “నమ్మినమ్మి” - సుఖ భోగము నమ్మి – ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? – రోగమును సంపాదించెను
నాయేసయ్యను నమ్మిన యెడల ( 2రాజులు 5:26,27 )
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే “నమ్మినమ్మి”