Paravasini ne Jagamuna |పరవాసిని నే జగమున
పరవాసిని నే జగమున ప్రభువా – నడచుచున్నాను నీ దారిన్
నాగురి నీవే నా ప్రభువా – నీధరి నే చేరెదన్ – నేను
1 లోకమంతా నాదని యెంచి – బంధు మిత్రులే ప్రియులను కొంటిని
అంతయు మోసమేగా – వ్యర్థము సర్వమును ఇలలో “పరవాసిని”
2 ధన సంపదలు గౌరవములు – దహించుపోవు నీ లోకములో
పాపము నిండె జగములో – శాపము చేకూర్చుకొనే లోకము “పరవాసిని”
3 నా నేత్రములు మూయబడగా – నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్ పరలోక దేశం – నాదు గానము యిదియే- నిత్యము “పరవాసిని “
4 తెలుపుము నా అంతము నాకు – తెలుపుము నా ఆయువు ఎంతో
తెలుపుము ఎంత అల్పుడనో – విరిగి నలిగి యున్నాను – నేను “పరవాసిని”
5.యాత్రికుడనే ఈలోకములో – సిలువ మోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగా – పొందితిని యేసును నేను పొందితిని