Priya yesu nirminchithivi|ప్రియ యేసు నిర్మించితివి
ప్రియ యేసు నిర్మించితివి – ప్రియమార నాహృదయం
ముదమార వసియించు – నా హృదయాంత రంగమున -2
- నీ రక్త ప్రభావముతో – నారోత హృదయంబును
పవిత్ర పరచుము తండ్రీ – ప్రతి పాపమును కడిగి “ప్రియ” - ఆజాగరూకుడనైతి – నిజాశ్రయంబును విడచి
కరుణా రసముతో నకై – కనిపెట్టితివి తండ్రీ “ప్రియ” - వికసించె విశ్వాసంబు – వాక్యంబును నే చదవగనే
చేరీతి నీదు దారి – కోరీ నడిపించుము “ప్రియ” - ప్రతి చోట నీసాక్షీగా – ప్రభువా నే నుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము – ఆత్మీయ రూపుండా “ప్రియ”