Raare Mana Yesu Swamini |రారే మన యేసు స్వామిని

క్రీస్తును చూడ రండి 83:1,2,3

1.రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే||
2.పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే||
3.తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.