Santhoshinchudi Andharu Natho |సంతోషించుఁడి యందరు

క్రీస్తు జన్మదినోత్సవము 113:1,2,3,4,5,6

1.సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతో||
2.అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతో||
3.కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతో||
4.మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్ను లాస దీరె ||సంతో||
5.ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతో||
6.పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతో||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.