Sarva adbhuthamulan |సర్వాద్భుతంబులన్
Now thank we all our God 36:1,2,3
1.సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ సర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ జేరరండి! మా రాకపోకలన్ మం వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును
2.మహా దయాళుఁడే మా జీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్మున్ ఎన్నండుఁ బ్రోచును.
3.ప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా! ప్రఖ్యాతికల్గగా అపారసన్నుతి నర్పింతు సర్వదా