Siyonu Kanya |సీయోనుకన్యా సంభ్రమపడుచు
ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు 158:1,2,3,4,5
1.సీయోనుకన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయక నీ రాజు భారవాహక మెక్కి బాలస్తోత్రములతో బైలుదేరి వచ్చె ||సీయోను||
2.హెబ్రాయిలోను నీ రాజు పేరు యూదులరాజు హెబ్రీయ జనులను అబ్రాము కొడుకులను విభవదేశము జేర్చు శుభరాజు యీతండే ||సీయోను||
3.హెల్లేనీలోను నీ రాజు పేరు యూదులరాజే యెల్లపాపులఁ బ్రోచు తాల్మిరక్షకుఁడితఁడు చల్లని ప్రభువని గొల్గొత మ్రోగెను ||సీయోను||
4.ఉర్వి రోమాలో నీ రాజు పేరు యూదులరాజే సర్వరాష్ట్రికులకు బూర్వపితరులతోను వరసింహాసన మిచ్చు వరదేశాధిపుఁ డితఁడు ||సీయోను||
5.వాసిగ హెబ్రీ హెల్లేనీలో రోమాయిలోను హోసన్నా ప్రభుని పేరట వచ్చు మెస్సీయ్యదావీదు కొడుకా శ్రీశుభములు ||సీయోను||