Sri Yesundu Janminche | శ్రీ యేసుండు జన్మించె | TELUGU CHRISTMAS SONG

యేసుని జననము 121:1,2,3,4,5,6,7,8
1.శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేఁడు పాయక బెత్లెహేమ యూరిలో ||శ్రీ యేసుండు|| 2.కన్నియ మరియమ్మ గర్భమందున ని మ్మాను యేలనెడి నామమందున ||శ్రీయేసుండు|| 3.సత్ర మందునఁ బశువుల సాలయందున దేవ పుత్రుండు మనుజుం డాయెనందున ||శ్రీ యేసుండు|| 4.పట్టి పొత్తిగుడ్డలతోఁ జుట్టఁబడి పసుల తొట్టిలోఁ బరుండబెట్టఁబడి ||శ్రీ యేసుండు|| 5.గొల్లలెల్లరు మిగుల భీతిల్లఁగ దెల్పె గొప్ప వార్త దూత చల్లఁగ ||శ్రీ యేసుండు|| 6.మన కొఱకొక్క శిశువు పుట్టెను ధరను మన దోషములఁ బోఁగొట్టను ||శ్రీ యేసుండు|| 7.పరలోకపు సైన్యంబుఁ గూడెను మింట వర రక్షకుని గూర్చి పాడెను ||శ్రీ యేసుండు|| 8.అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపర్చెను ||శ్రీ యేసుండు||
Download MP3 Here: