Trithavamai |త్రిత్వమై నిత్యత్వమున
త్రిత్వమునకు స్తుతి 21:1,2,3,4,5
1.త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||
2.ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను ||త్రిత్వమై||
3.వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు ||త్రిత్వమై||
4.ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||
5.ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు ||త్రిత్వమై||