Yenduko Nanninthaga Neevu |ఎందుకో…నన్నింతగా నీవు
ఎందుకో…నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర – హల్లేలూయ యేసయ్యా – 2
- నా పాపము బాప నర రూపివైనావు –
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే – 2 - నీ రూపము నాలో నిర్మించి యున్నావు –
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు – నీ కొరకై నీకృపలో – 2 - నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు –
నా వ్యధలుభరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు – నను దాచియున్నావు – 2 - నా మనవులు ముందే నీమనసులో నెరవేరే –
నా మనుగడముందే నీగ్రంధములో నుండే
యేమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతు – 2 - నీ చేతులతోనే నన్ను చేసి యున్నావు –
నీ గాయములోనే నను దాచి యున్నావు
నీదు సేవను చేయుచున్నాను – నీ కొరకై జీవింతున్