Yevari Kosamo E Prana Thyagamu |ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము – 2
నీకోసమే నాకోసమే కలువరి పయనం
ఈ కలువరి పయనం …..”ఎవరికోసమో”
- ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా – 2
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా… – సోలి వాలి పోయావా…. - జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటూ పొడిచితిమి
*తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు *
అని వేడుకొన్నావా…. పరమ తండ్రిని