Ashirvadambul Mamida |ఆశీరవంబు ల్మామీద
There shall be showers of Blessing 386:1,2,3,4
1.ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు మీశ యాశతో నమ్మి యున్నాము నీసత్య వాగ్దత్తము. || ఇమ్మహి మీద క్రుమ్మరించుము దేవ క్రమ్మర ప్రేమ వర్షంబున్ గ్రుమ్మరించుము దేవా ||
2.ఓ దేవ పంపింప వయ్యా నీ దీవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్
3.మామీఁద కురియించు మీశ ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీఁద క్షామంబు పోనట్లుగన్.
4.ఈనాఁడె వర్షింపు మీశ నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేఁడి సన్నుతిఁ బ్రార్థింతుము.