Ashirvadamu neeyuma |ఆశీర్వాదము నీయుమ మా పరమజనక

బాలల జన్మ దినోత్సవము 555:1,2,3,4,5,6

1.ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వాదము||
2.యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ బెంచుము ||ఆశీర్వాదము||
3.నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము ||ఆశీర్వాదము||
4.ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ ||ఆశీర్వాదము||
5.సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ ||ఆశీర్వాదము||
6.భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వాదము||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.