Chudare kreesthuni Chudare |చూడరే క్రీస్తుని జూడరే
సిలువ ధ్యానము 188:1,2,3,4
1.చూడరే క్రీస్తుని జూడరే నా సఖులార చూడరే క్రీస్తుని జూడరే చూడరే నాముక్తి పదవికి ఱేఁడు యేదశఁ గూడినాఁడో ||చూడరే||
2.మించి పొంతి పిలాతు సత్య మొ కించుకైనఁ దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల మంచితనమే కోరి యప్ప గించెనా మేలు గ ణించెనా ఇతనిఁ గాంచి కాంచి భక్తులెట్లు స హించిరో పరికించి మీరిది ||చూడరే||
3.మంటికిని నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండఁగ నంటఁ గొట్టఁగ సిలువ మ్రాని కప్పగించుటకొరకు నిన్నుఁ గాంచెనా యిది మది నెంచెనా హా నా కంట నే నిటువంటి యాపదఁ గంటిఁ బ్రాణము లుండునే యిఁకఁ ||జూడరే||
4.ఊటగా రక్తంబు కారుచు నుండ బల్లెపుఁ బ్రక్కపోటు మాటిమాటికిఁ జూడ దుఃఖము మరలునే తలమీఁద ముళ్లకి రీటమా యితనికి వాటమా యూదులు మోటులై బాహాటమున నీ పాటులను గాటముగఁ జేసిరి ||చూడరే||