E Jeevitha Eetha |ఈ జీవిత ఈత ఈదలేకున్నాను

633:1,2,3,4,5,6,7,8

1.ఈ జీవిత ఈత ఈదలేకున్నాను నా చేయి పట్టుకో నా యేసునాధా
2.సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
  సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము 
  సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము                  ||ఈ||
3.సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు 
  సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి 
  సమాధానము నొసగ సరగున రావా                  ||ఈ||
4.బయట పోరాటములు భయపెట్టుచుండెను
  బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె
  బాధలన్నియు బావ బహుత్వరగ రావా                ||ఈ||
5.రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై
  రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున
  రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము           ||ఈ||
6.సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా
  గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
  సమాధానరాజ్యం స్థాపించరావా                     ||ఈ||
7.మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున 
  జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ
  నాలుగవ జామున నడచివస్తున్నారా                  ||ఈ||
8.పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము
  నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి 
  వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్            ||ఈ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.