Edenu Vanambunandu |ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్
The voice that breathed o’er Eden 566:1,2,3,4,5,6
1.ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్.
2.పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు.
3.సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు.
4.ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము
5.నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము.
6.ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి.