Iyyudi Meeku Iyyabadunani |ఇయ్యుడి మీకియ్యబడునని

దాతృత్వము 570:1,2,3,4,5,6,7

1.ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి||
2.మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||
3.శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||
4.కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి||
5.సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||
6.యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి||
7.పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.