Jyothiga mamu cheyumo |జ్యోతిగ మము జేయుమో దేవా

జ్యోతిగ మము జేయుము 444:1,2,3,4,5

1.జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||
2.మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||
3.సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||
4.నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||
5.సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.